Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: నందం గణేష్ బాబు

Author
Posted By TELANGANA KERATAM
| 06 Nov 2026, 07:52 AM | 6 | Politics, తెలంగాణ
ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: నందం గణేష్ బాబు
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి నవంబర్ 5: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు అన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన బడులు.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ డివిజన్ కొండాపూర్ లోని ప్రాథమిక పాఠశాలకు రంగులు వేయించేందుకు సహకరించిన ఆయనను గురువారం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించి రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా గణేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ ముందుగా సహకరించిన నందం గణేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను సమాజ భాగస్వామ్యంతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ముల్లి జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ డక్కి రమేష్, ఆర్గనైజేషన్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: