Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దుబ్బాక నియోజికవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. -వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. -సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్.

Author
Posted By Kancharala Shivakumar
| 07 Nov 2026, 10:01 PM | 6 | తెలంగాణ
దుబ్బాక నియోజికవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. -వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. -సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్.

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 07, తెలంగాణ కెరటం:

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల, పట్టణ కమిటీల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గొడ్డుబర్ల భాస్కర్ మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దుబ్బాక నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉంటుందనీ భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతుల పంటలు దిగుబడి రాక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం చాలా తక్కువగా కురిసినందున తెలంగాణ రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా అదే తరహాలో కరువు నెలకొన్నదనీ తెలిపారు.ప్రస్తుతం రైతుల బోరుబావులు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయనీ ప్రజలకు తాగునీరు కూడా అందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని ప్రజలను,రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలనీ నవంబర్ 20 న సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాక మండలం మరియు మున్సిపల్ పట్టణ పరిధిలోని ఐకెపి మరియు పిఎసిఎస్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ చేశారు. అకాల వర్షాలు కురిస్తే చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోయి రైతులు దివాలా తీసే ప్రమాదం పొంచి ఉన్నందనీ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను మంజూరు చేసి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల, కార్యదర్శి ఎస్ .నవీన, పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, నాయకులు ఎండీ , సాదిక్, ఎండీ .సాజిద్, మెరుగు రాజు,తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: