తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 7, నవంబర్
*జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కల్పించాలి*
...రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకటరమణ రావు
సంగారెడ్డి నవంబర్ 7:
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లా సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరంపల్లి అశోక్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకటరమణ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్. ఘోరి, రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. ఖలీల్ సబ్ హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా...
**రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకటరమణ రావు మాట్లాడుతూ...*
రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఎలాంటి వివక్ష లేకుండా హెల్త్ కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులు నిరంతరం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతతో పాటు వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
*రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్. ఘోరి మాట్లాడుతూ...*
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరినీ సంఘటితం చేస్తూ వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గుర్తింపు కార్డులు, ఇతర సౌకర్యాలు అందేలా సంఘం నాయకులు కృషి చేయాలని సూచించారు. జిల్లా, మండల స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
*రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. ఖలీల్ సబ్ మాట్లాడుతూ..*.
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు, భద్రత, సంక్షేమ పథకాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల ఐక్యతే సంఘానికి బలమని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో సంఘ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
*జిల్లా అధ్యక్షులు మహ్మద్ సిద్ధిక్ అహ్మద్ మాట్లాడుతూ...*
సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జిల్లా కమిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. జిల్లాలోని అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు జిల్లా కమిటీ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. సంఘంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ టీజేఏ బలోపేతానికి సహకరించాలని కోరారు.
సమావేశం అనంతరం టి జె ఎ యూనియన్ ఐడి కార్డలను జర్నలిస్ట్ లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ ముజహిద్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. అశోక్ బాబు, ఎం. మహిపాల్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీ జి. మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. చంద్రారెడ్డి, ఇందూరి కృష్ణ, పి. రాజు, గోవర్ధన్, రామకృష్ణ, ఖలీలుద్దీన్, భాస్కర్, రమేష్, ప్రకాష్, జంగిరి అలీ అహ్మద్, ఎం. డి అక్బర్ అలీ,తదితర జిల్లా కమిటీ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.



