Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు -ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్న -9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్, వార్డు ఆఫీసర్ కరుణాకర్

Author
Posted By Kancharala Shivakumar
| 08 Nov 2026, 08:15 PM | 6 | తెలంగాణ
ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు -ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్న  -9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్, వార్డు ఆఫీసర్ కరుణాకర్

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 08, తెలంగాణ కెరటం:

దీపావళి పండుగను పురస్కరించుకుని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ధర్మాజీపేటలో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్, వార్డు ఆఫీసర్ తునికి కరుణాకర్ పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి పండుగ సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడం ఎంతో సంతోషకరమని అన్నారు. సొంత ఇంట్లో దీపావళి పండుగను జరుపుకోవడం లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనగామ విజయ్, జనగామ నరసయ్యతో పాటు పలువురు స్థానికులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: