Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ ఇళ్లలో వెలుగులు నింపిన దీపావళి సంబరాలు. -లబ్ధిదారులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్

Author
Posted By Kancharala Shivakumar
| 08 Nov 2026, 07:37 PM | 10 | తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లలో వెలుగులు నింపిన దీపావళి సంబరాలు. -లబ్ధిదారులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్

దుబ్బాకప్రతినిధి,(అక్బర్‌పేట-భూంపల్లి) నవంబర్ 08, తెలంగాణ కెరటం:

అక్బర్‌పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మధ్య దీపావళి పండుగ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.ఈ వేడుకల్లో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్, గ్రామపంచాయతీ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతున్న వేళ, వారి మధ్య దీపావళి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆనందాన్ని కలిగించిందని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్ పేర్కొన్నారు.ప్రతి ఇంటా సంతోషాలు, ప్రతి కుటుంబంలో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ లబ్ధిదారులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లబ్ధిదారుల్లో ఆనందాన్ని నింపింది. దుబ్బాక నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 5500 ఇందిరమ్మ ఇల్లును ఇప్పటికీ మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు ఉప సర్పంచ్ నవీన్ గౌడ్, మాజీ ఎంపిటిసి పాతూరి శ్రీనివాస్ గౌడ్, కూడా వెళ్లి దేవస్థానం డైరెక్టర్ వెలుపుల యాదగిరి ముదిరాజ్, వార్డు మెంబర్లు గడ్డం యాదగిరి, బొమ్మరపు సుకన్య ఎల్లం, బోడోల్ల అంజయ్య, గోద శృతి, వెలుపుల సత్తవ్వ రాజయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపరి రమేష్, పొట్టేళ్ల పరుశురాములు, వేల్పుల ఎల్లం, గొడుగుపల్లి మల్లయ్య, వేల్పుల అంజయ్య, గోదా పరుశయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: