Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు

Author
Posted By TELANGANA KERATAM
| 09 Nov 2026, 06:25 AM | 3 | Politics, తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లలో ఘనంగా దీపావళి సంబరాలు
 కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 8, నవంబర్
 *లబ్ధిదారుల ఇళ్లలో మంత్రి వివేక్ వెంకటస్వామి, కాట శ్రీనివాస్ గౌడ్ ఆత్మీయ విందు
 *సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ*

పటాన్‌చెరు: ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమం పండుగ శోభను సంతరించుకుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన మంత్రి వివేక్ వెంకటస్వామి, కాట శ్రీనివాస్ గౌడ్ వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తూ వారి కుటుంబ సభ్యులతో పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం టపాసులు కాల్చి చిన్నారులు, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కృషి చేస్తోందని నాయకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: