Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హ్యాపీ బర్త్ డే రేవంతన్న.. ధగ పడ్డ తెలంగాణను దారిలో పెట్టిన ఘనత మీదే.

Author
Posted By TELANGANA KERATAM
| 09 Nov 2026, 06:54 AM | 16 | Politics, తెలంగాణ
హ్యాపీ బర్త్ డే రేవంతన్న..  ధగ పడ్డ తెలంగాణను దారిలో పెట్టిన ఘనత మీదే.
హ్యాపీ బర్త్ డే రేవంతన్న..  
ధగ పడ్డ తెలంగాణను దారిలో పెట్టిన ఘనత మీదే.
 తెలంగాణ, కెరటం, స్టేట్, ఇంచార్జ్, షేక్, మహబూబ్ 8,

 నవంబర్. తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి పాత్ర అమోఘం.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అడుగులు
ప్రతి ఇంటికి సంక్షేమం.. ప్రతి వాడకు అభివృద్ధి.. 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు ముదిరాజ్..

ధగాపడ్డ తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితభావంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం అభినందనీయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. 
ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కొడంగల్ లోని ఆయన నివాసంలో సిఎంను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి హ్యాపీ బర్త్ డే రేవంత్ అన్న అంటూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నీలం మధు ను ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ పదేండ్ల కెసిఆర్ తెలంగాణ ను అప్పుల కుప్పగా మారిస్తే, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రశంసించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అమరుల త్యాగాలు, ప్రజల పోరాట ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యతను రేవంత్ రెడ్డి సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు.
ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. 
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుంచి పట్టణాల వరకు అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

తెలంగాణ పునర్నిర్మాణం అనేది ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, అందుకు దూరదృష్టి, పట్టుదల, నిరంతర శ్రమ అవసరమని నీలం మధు అన్నారు. అలాంటి బాధ్యతను భుజాన వేసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని మరోసారి గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడించి తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆయన సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. భగవంతుడి దయతో రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: