Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ పార్టీయే..

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 05:24 AM | 3 | Politics, తెలంగాణ
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్ పార్టీయే..
సోనియా, ఖర్గే చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం

బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 09 : భారతదేశ స్వతంత్ర చరిత్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది, చేసేది కూడా కాంగ్రెస్ పార్టీయేనని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ అన్నారు. అందుకు నిదర్శనం 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తనకు కన్నీళ్లు తెప్పించిందని సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు హిందువులు జరుపుకునే పవిత్రమైన దీపావళి పండుగను ముస్లింలు జరుపుకునే ఈద్గా పండుగతో పోల్చడం, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శమని విమర్శించారు. 1990 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూ కాశ్మీర్లోని 35 లక్షల పండిట్ కుటుంబాలు ముస్లింల ఆగడాలు తట్టుకోలేక ఢిల్లీ పురవీధుల్లో శరణార్థులుగా మారి అన్నమో.. రామచంద్ర అంటూ అడుక్కుతిన్నప్పుడు సోనియాగాంధీ మనసు ఎందుకు చలించలేదని, బాబ్రీ మసీదు కూల్చివేతను టీవీలో చూసి కన్నీళ్లు పెట్టుకున్న సోనియా గాంధీ కర సేవకులు పాల్గొన్న సమయంలో ఉత్తరప్రదేశ్ లోని మూలయం సింగ్ యాదవ్ ప్రభుత్వం హిందువులపై జరిపిన దమనకాండ కర సేవకులను తుపాకులతో కాల్చి కత్తులతో నరికి గోనె సంచుల్లో కుట్టువేసి సరయు నదిలో పారేస్తే, రక్తం ఏరులై పారినప్పుడు సోనియాగాంధీ మనసు ఎందుకు చలించలేదని ప్రశ్నించారు. భారతదేశం సరిహద్దు లోపల ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి అక్రమంగా చొరబడిన చోటబాటుదారులను తరిమేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏంటని అన్నారు. మొన్న ఇటీవల జరిగిన వినాయక నవరాత్రోత్సవాలలో కొందరు ముస్లిం మూకలు వినాయకుడిపై ఆవు మాంసం ముద్దలు విసిరేశారని దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవి విగ్రహాల మీద చాపల ముక్కలు చాపల వ్యర్ధాలు విసిరేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన మూడిల కాంగ్రెస్ పాలనలో 46 హిందూ దేవాలయాలపై అన్యమతస్తులు దాడి చేసినప్పుడు సోనియాగాంధీ మనసు ఎందుకు చలించలేదని అన్నారు. కల్మ చదివే వాళ్ళు ఎవరైనా మా వాళ్లే కులాలతో సంబంధం లేదని వారు రావైనా, రెడ్డైనా, సాల అయినా, చాకలి అయినా మాకు ఒక్కటేనని ఎంఐఎం నాయకులు నాయకులు వ్యాఖ్యానించినప్పుడు సోనియా మనసు మానసికంగా మంచిగా లేడా అని అన్నారు. నరేంద్ర మోడీ గారు 2047 వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ విభజన భారత్ కు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అంతేకాకుండా 2002లో కర సేవలో పాల్గొని సబర్మతి ఎక్స్ప్రెస్ ల ప్రయాణిసస్తున్న హిందువులపై కొందరు ముస్లిం మూకలు పెట్రోలు చల్లి దాడి చేసి వందలాది మంది కరసేవకుల చావుకు కారణం అయినప్పుడు సోనియాగాంధీ మనసు ఎందుకు చలించలేదని ప్రశ్నించారు. ఆధర్మంపై ధర్మం గెలిచిందని సూచికగా హిందువులు జరుపుకునే దీపావళి పండుగను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హిందువుల ఈద్గా అంటూ పోల్చడం దారుణం అని అన్నారు. రాజకీయ పరిపక్వత లేని రాహుల్ గాంధీ దేశంలో ఉన్నటువంటి సమస్యలపై ప్రధానమంత్రి మోడీ బహిరంగ చర్చకు రావాలని చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అపరిపక్వతకు నిదర్శమని దేశంలో ఉన్న ఏ సమస్యలైనా చర్చించడానికి పార్లమెంట్ వేదికగా ఉందని పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోయే లక్షణం ఉన్న రాజకీయ పరిపక్వత లేని రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా కాంగ్రెస్ నాయకులు ఊహించుకోవడం సిగ్గుచేటుని అన్నారు. 1971 లో దొడ్డి దారిన గెలిచి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ తన సమీప ప్రత్యర్థి స్వామి నారాయణ్ వేసిన కేసులో ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టు దోషి అని తేల్చి ఆరేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హురాలిగా ప్రకటించిన తర్వాత ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండా అత్యవసర పరిస్థితి విధించి ఇందిరాగాంధీ తప్పు చేశారని సోనియా గాంధీ ఒప్పుకోవడం ప్రజాస్వామ్యవాదులు గమనించాలని మర్రిపెల్లి సత్యమ్ కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: