కమ్యూనిటీ హాల్, మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 09 : జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో కమ్యూనిటీ హాల్, మోతే రెడ్డి సంఘ భవన నిర్మాణానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి గారి ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంజూరైన నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి బోగ శ్రావణి సోమవారం గ్రామ ప్రజలకు, సంబంధిత సంఘం ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా భోగ శ్రావణి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధుల నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రజలకు, సామాజిక వర్గాలకు ఉపయోగపడే భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదారి అశోక్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్, అర్బన్ మండల ఉపాధ్యక్షులు తిరుపతి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దానపనేని నరేష్, సల్ల రమేష్, ఇట్యాల రాము, మ్యాదరి శ్రీనివాస్, మారవేణి మల్లేశం, బింగిశెట్టి తిరుపతి, పంబల వసంత్, బలె సంతోష్, అక్కినపల్లి కాశీనాథం, ఇనుగుర్తి శ్రీనివాస్ బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు, సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.



