Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం.. రాగి తీగలు,ఆయిల్ చోరీపై అప్రమత్తంగా ఉండాలి

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 05:26 AM | 3 | Politics, తెలంగాణ
ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం.. రాగి తీగలు,ఆయిల్ చోరీపై అప్రమత్తంగా ఉండాలి
ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం.. రాగి తీగలు,ఆయిల్ చోరీపై అప్రమత్తంగా ఉండాలి

విద్యుత్ శాఖ ఏఈ కిషన్ 

 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 9 :


నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల పరిధిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి రాగి తీగలను,ఆయిల్ చోరీ చేస్తున్న ఘటనల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్‌ శాఖ ఏఈ కిషన్‌ సూచించారు. వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల పరిరక్షణకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.గ్రామాల వారీగా రైతులు సమన్వయంతో బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, గుర్తుతెలియని వాహనాలు సంచరించినా వెంటనే స్థానికులకు, పోలీసులకు, విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాన్స్ ఫార్మర్ కు నాలుగు దిక్కుల వెల్డింగ్‌ ద్వారా భద్రతా ఏర్పాట్లు చేయించుకోవాలని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా చోరీలకు పాల్పడే వారిని గుర్తించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పొలాల వద్ద లైటింగ్‌ ఏర్పాటు చేసుకోవడం, సమీప రైతులు పరస్పరం సమాచారాన్ని పంచుకోవడం ద్వారా చోరీలను అరికట్టవచ్చని సూచించారు.ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, వెల్డింగ్‌, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను కాపాడుకోవడం ద్వారా రైతులకు పంటల సాగులో విద్యుత్‌ అంతరాయం, ఆర్థిక నష్టాలు తప్పుతాయని ఏఈ కిషన్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: