Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కిరాణా షాప్ చాటున అక్రమ మద్యం విక్రయాలు భారీగా మద్యం సీజ్, నిందితురాలు అరెస్ట్

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 06:50 AM | 8 | Crime, తెలంగాణ
కిరాణా షాప్ చాటున అక్రమ మద్యం విక్రయాలు భారీగా మద్యం సీజ్, నిందితురాలు అరెస్ట్
కిరాణా షాప్ చాటున అక్రమ మద్యం విక్రయాలు భారీగా మద్యం సీజ్, నిందితురాలు అరెస్ట్.......
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు..
మంచిర్యాల...
మందమర్రి మార్కెట్ ఏరియాలో కిరాణా షాప్ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం నిల్వ ఉంచి, విక్రయిస్తున్న ఒక మహిళను మందమర్రి పోలీసులు శనివారం మద్యాహ్నం పట్టుకున్నారు.

కేసు వివరాలు:
పోలీసులకు అందిన నమ్మదగిన సమాచారం మేరకు మందమర్రి పోలీసులు మార్కెట్ ఏరియాలోని ఒక కిరాణా షాపుపై దాడి చేశారు. అక్కడ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన భారీ పరిమాణంలో వైన్స్, బీర్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితురాలి వివరాలు:
పోలీసుల విచారణలో నిందితురాలు మందమర్రికి చెందిన కొనగంటి రమ @ రాములమ్మ (61 సంం), భర్త: (లేట్) సురేష్ గా గుర్తింపు పొందింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో, మద్యం షాపుల నుండి వైన్స్, బీర్లు కొనుగోలు చేసి, తన కిరాణా షాపులో నిల్వ ఉంచి చుట్టుపక్కల వారికి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు ఆమె పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది.

నిందితురాలి నివాసం/షాపులోని ఒక గది నుండి పోలీసులు పంచుల (సాక్షుల) సమక్షంలో మద్యాన్ని సీజ్ చేశారు.

• మొత్తం మద్యం పరిమాణం: 74. 450లీటర్లు (74,450 ml) సొత్తు విలువ: ₹38,860/-
మందమర్రి పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, మద్యం బాటిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. చట్టవిరుద్ధంగా మద్యం బెల్ట్ షాపులు నడిపినా, అక్రమంగా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: