నకిరేకల్ ఆనంద నిలయం వసతిగృహం అక్రమాల నిలయంగా మారిందా
తెలంగాణ కెరటం ( నవంబర్ 11) నల్గొండ ప్రజా ప్రతినిధి: నకిరేకల్ ఆనంద నిలయం వసతిగృహ ఎఫ్ ఎస్ సి, ఏ ఎస్ డబ్ల్యూ ఓ పై తీవ్ర ఆరోపణలుఆరు నెలలుగా విధులకు సక్రమంగా హాజరుకాకుండానే ప్రభుత్వ వేతనం ఇష్టం వచ్చినప్పుడు హాస్టల్‌కు వచ్చి హాజరు రిజిస్టర్లలో సంతకాలు
కలెక్టర్ అనుమతి లేకుండానే రెండు వసతిగృహాల బాధ్యతలు ఒకే అధికారికి అప్పగించారారెండు హాస్టళ్ల విద్యార్థులకు ఒకే చోట వంటలు రెండు వసతిగృహాలకు మెస్ బిల్లులు డ్రావిద్యార్థులకు అందాల్సిన బియ్యం, దుప్పట్లు, పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు పక్కదారి పట్టించుకోవడం లేదు.
హాస్టళ్లలో జరుగుతున్న వ్యవహారాలపై డిప్యూటీ డైరెక్టర్‌కు తెలియదా? తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించారా..?
పర్సెంటేజీల పేరుతో వసతిగృహ సంక్షేమ అధికారులపై వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై విచారణ ఎప్పుడు..? విద్యార్థి సంఘాల ఫిర్యాదులకూ స్పందన లేదా..?ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు ఇదే అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ఇంత తీవ్రమైన ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.నకిరేకల్ మండల కేంద్రంలో ఉన్న రెండు, ఎస్సీ బాలుర వసతిగృహ అధికారులపై, సంబంధిత పర్యవేక్షణ అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలి..!హాజరు రికార్డులు, మెస్ బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేయాలి.అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఫిర్యాదులు చేసినా చర్యలు లేకపోతే ఇక విద్యార్థులకు న్యాయం జరిగేది ఎప్పుడు.జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని



