ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మానవత్వం..
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11, నవంబర్
ఓఆర్‌ఆర్ ప్రమాద క్షతగాత్రులను సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మరోసారి తన గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాద సమయంలో స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించి బాధితులకు అండగా నిలిచారు. బుధవారం ఉదయం ఎమ్మెల్సీ అంజిరెడ్డి తన అధికారిక పర్యటన నిమిత్తం ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తుండగా... అదే మార్గంలో ఓ కారు అదుపుతప్పి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న అంజిరెడ్డి తన కాన్వాయ్‌ను వెంటనే ఆపి, కారులో క్షతగాత్రులను గమనించి, అంబులెన్స్ కోసం వేచి చూస్తే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గ్రహించారు. బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి తో కలిసి వెంటనే స్పందించి, బాధితులను తన సొంత వాహనంలో ఎక్కించి సురక్షితంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరుకున్న వెంటనే అత్యవసర వైద్య విభాగాన్ని అప్రమత్తం చేసిన ఆయన డాక్టర్లతో మాట్లాడి క్షతగాత్రులకు ఎలాంటి ఆలస్యం లేకుండా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు అందుతున్న చికిత్సను స్వయంగా పర్యవేక్షించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యమని నిరూపించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉదార స్వభావాన్ని స్థానికులు, ప్రయాణికులు అభినందించారు.



