Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మద్దూరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 08:34 PM | 4 | Politics, తెలంగాణ
మద్దూరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం
మద్దూరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 11

మద్దూరు: మున్సిపాలిటీ,  కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మూడు రోజుల పాటు పర్యటించినా రైతులకు ఎలాంటి భరోసా లభించలేదని మద్దూరు మండల బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. మంగళవారం మద్దూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేసి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి పర్యటన చేపట్టినా, ఎల్‌నినో ప్రభావంతో వరి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంపై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆరోపించారు. పంటలు దెబ్బతిని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి హామీ ఇస్తారని ఆశించినప్పటికీ నిరాశే మిగిలిందని నాయకులు పేర్కొన్నారు. ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్ కౌన్సిలర్ లో, మున్కంపల్లి నరసింహ, ఎండి మౌలానా, కల్లపు దినేష్, లింగయ్య నాయక్, జాజురావుపల్లి గోపాల్, నాయకులు శివకుమార్, మాజీ సర్పంచ్, నరేష్, తిరుపతి రెడ్డి, శ్రీహరి, ఎండి మౌలానా, అంజయ్య, భీమ్ షేన్,
నారాయణ, నెల్లి రాములు, సర్పంచ్ మైపాల్, తదితరులు పాల్గొన్నారు...

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: