తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల......
వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో గత 20 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా గత 30 రోజులుగా శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆందోళనకు తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా శాఖ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది.
ఈ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన సంఘీభావ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు డా. చంద్రమోహన్ గౌడ్ ఉదారి పాల్గొని NHM ఉద్యోగులకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న NHM ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించాలని, వారి సేవలకు తగిన గుర్తింపు ఇచ్చి క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల హక్కుల సాధన కోసం వారు చేస్తున్న శాంతియుత పోరాటానికి తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తమ మద్దతు కొనసాగిస్తుందని ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు ఇంచార్జి తిప్పరపు సారయ్య స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ తిప్పారపు సారయ్య, మంచిర్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు హారిక రావు , మహిళా రాష్ట్ర నాయకురాలు నిషా , జిల్లా సంయుక్త కార్యదర్శులు రాచకొండ సురేష్ , లెనిన్ లు , జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సంధ్య , జిల్లా అధికార ప్రతినిధి శ్రీవాణి , రక్షణ సేన నాయకులు జహీర్ ఖాన్ , రజిత , రాజశేఖర్ , ప్రశాంత్ , జ్యోతి , వసంత , కాసిపేట మండల అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు



