*మేకల దాసు
AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి..
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...
మంచిర్యాల...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాల పెంపుదల -చట్ట ప్రకారం పండగ, జాతీయ, ఆర్జిత సెలవుల అమలు -ప్రతి సంవత్సరం బోనస్ చెల్లింపు -ప్రతి ఒక్కరికి 2 జతల యూనిఫారం -ప్రతినెలా 1వ తేదీన వేతనాల చెల్లింపు - ఇయస్ఐ, పిఎఫ్ లు సక్రమంగా కార్మికుల ఖాతాల్లో జమచేయాలి.
మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు 26 వేల వేతనం ఇవ్వాలి.
RMO టి శ్రీధర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.
గతంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి శానిటేషన్, పేషెంట్కేర్, సెక్యూరిటీ కార్మికుల వేతనాలు పెంచేవారు. కానీ ఈ సారి 4 సంవత్సరాలు దాటినప్పటికీ వేతనాలు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయినవారికి కనీసం 16వేలు చెల్లించాలని జి.ఓ. నెం. 6 జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పైన పేర్కొన్న ఉద్యోగులు గత 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులు. కావున వారికి న్యాయమైన పద్దతిలో నెలకు రూ.26వేలు చెల్లించాలని అలాగే చట్ట ప్రకారం పైన పేర్కొన్న సెలవులను అమలు చేయించాలని ముఖ్య యజమానిగా ప్రభుత్వం తరుపున సూపరిండెంట్ గారిని కోరుతున్నాం. అలాగే సంవత్సరానికి ఒక నెల జీతం బోనస్ గా చెల్లించాలని కోరుచున్నాము.
కాంట్రాక్టర్లు ఇస్తున్న మొత్తం వేతనం పై ఇయస్ఐ, పిఎఫ్లను కట్చేస్తూ కార్మికుల ఖాతాల్లో మాత్రం చాలా తక్కువ సొమ్మును జమచేస్తున్నారు. చట్ట ప్రకారం కార్మికునికి చెల్లించే పూర్తి వేతనంపై పిఎఫ్, ఇయస్ఐలను మినహాయించగా వచ్చిన సొమ్ముకు అంతే సొమ్మును కలిపి కార్మికుల ఖాతాల్లో జమచేయాలి. ఒకవేళ కాంట్రాక్టర్ జమచేయని యడల చట్ట ప్రకారం ముఖ్య యజమాని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తేది: 09.08.2026న డి.ఎం.ఇ. గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినప్పుడు ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని అప్పటి డి.ఎం.ఇ. గారు మరియు వైద్య ఆరోగ్య శాఖామాత్యులు గౌరవనీయులు దామోదర రాజనర్సింహ్మ గారు ప్రతికల ద్వారా ప్రకటించారు. కానీ 1వ తేదీన వేతనాలు చెల్లించటం లేదు. కాబట్టి మన ఆసుపత్రుల్లో ప్రతినెలా 1వ తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోగలరని కోరుచున్నాము.
వెంటనే నూతన కాంట్రాక్టర్లను ఆహ్వానించి కార్మికుల జీతాలు పెంచే విధంగా, కార్మికులకు చట్ట ప్రకారం రావాల్సిన సెలవులు, బోనస్ అందే విధంగా ఉన్నత అధికారులతో చర్చించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో AITUC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలిందర్ అలీ ఖాన్,మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు రాయమల్లు, మధు,సువర్ణ లు పాల్గొన్నారు.



