తెలంగాణ కెరటం / సికింద్రాబాద్ నియోజకవర్గం
- సీజ్ చేసిన నిర్మాణంపై ఒత్తిళ్లు ఎందుకు?
- విధుల్లో ఉన్న జిహెచ్ఎంసి సిబ్బందిని వేధించడం సమంజసమేనా?
- నిబంధనల ప్రకారమే జిహెచ్ఎంసి చర్యలు.. అయినా ఎందుకు పదేపదే ఫోన్లు?
బేగంపేట్ :
ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది.
నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు ఉంటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం సహజం.
అయితే చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్న అధికారులపై వ్యక్తిగత ఒత్తిళ్లు, ఫోన్ కాల్స్ ద్వారా ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏమిటి?
ప్రభుత్వ ఉద్యోగి విధులను ప్రశాంతంగా నిర్వర్తించే హక్కును కూడా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై లేదా?
- చట్టప్రకారం చర్యలు.. అధికారుల విధుల్లో జోక్యం ఎందుకు?
హైదరాబాద్ బేగంపేట్‌లోని 1-11-111/6/C, బేగంపేట్, హైదరాబాద్–500016 చిరునామాలో ఉన్న నిర్మాణంపై జిహెచ్ఎంసి అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిర్మాణానికి సంబంధించిన ఫిర్యాదులు, అనుమతులు, నిబంధనల పరిశీలన అనంతరం అధికారులు సీజ్ ప్రక్రియ చేపట్టారు. ఈ భవనంలో ప్రస్తుతం ఎస్వి రిబర్ట్ హాస్పిటల్,కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో, రోగులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
అయితే నిర్మాణానికి సంబంధించిన పాత యజమాని సీజ్ చర్యలపై అసంతృప్తితో జిహెచ్ఎంసి సిబ్బందికి పదేపదే ఫోన్లు చేస్తూ, అధికారుల విధులకు ఇబ్బంది కలిగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చట్టప్రకారం తమ విధులు నిర్వహిస్తుంటే వారిపై వ్యక్తిగత ఒత్తిళ్లు తీసుకురావడం ఎంతవరకు సమంజసం? నిర్మాణాన్ని విక్రయించిన అనంతరం కూడా అదే అంశంపై అధికారులపై ఒత్తిడి తీసుకురావాల్సిన అ�



