Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మచ్చ బొల్లారం జడ్పిహెచ్ఎస్ లో డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సు

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 06:17 AM | 13 | Politics, తెలంగాణ
మచ్చ బొల్లారం జడ్పిహెచ్ఎస్ లో డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సు

అల్వాల్ నవంబర్ 13 (తెలంగాణ కెరటం న్యూస్)

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అల్వాల్ సర్కిల్ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఫ్రైడే -డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దోమల నివారణకై డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే -డ్రైడే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు.ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పూల కుండీలు, పాత టైర్లు, కూలర్లు, కొబ్బరి బొండాలు, నీళ్ళ తొట్టిలలో ఉండే నీళ్ళను తీసివేయాలని తెలిపారు. నిల్వ ఉండే నీటిలో లార్వా వృద్ధి చెంది దోమల వ్యాప్తి చెందుతాయని అవి కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. వ్యాధులు రాకముందే మనం జాగ్రత్త పడాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ విభాగం డిఈ సందీప్, సూపర్వైజర్లు వేలు, గణేష్, రాజు, కిషోర్, వెంకటేష్ ఎస్ఎఫ్ఏ శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ రాజు, అరుణ , చంద్రకళ, నరసింహ, మహిపాల్ రెడ్డి,బలరాం, ప్రసాద్, సునీత, జయంతి, శ్రీవల్లి, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: