Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణ బిల్డింగ్ అండ్ కాంట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి.

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 06:50 AM | 5 | Politics, తెలంగాణ
తెలంగాణ బిల్డింగ్ అండ్ కాంట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి.
  • తెలంగాణ బిల్డింగ్ అండ్ కాంట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి.
తెలంగాణ బిల్డింగ్ అండ్ కాంట్రాక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ కు వినతి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 13):

తెలంగాణ బిల్డింగు అండ్ కాంట్రాక్షన్స్ వర్కర్స్ యూనియన్ అనుబంధం ఏఐటీయూసీ
రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా లేబర్ కమిషనర్ గార్లకు సంక్షేమ బోర్డును కాపాడాలని కోరుతూ శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లేబర్ ఆఫీస్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దంగట్ల వెంకటస్వామి తో కలిసి మాట్లాడుతూ
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.
ఇందిరమ్మ భీమాతో ముడి పెట్టొద్దని,ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉందని , కోట్ల రూపాయలు ఐటీసీ సెంట్రల్ ర నిర్మాణం కోసం రక్త పరీక్షల కోసం, సిఎస్సి హెల్త్ కేర్ సెంటర్, వారికి ఖర్చు చేస్తున్నారని అన్నారు, సహజ మరణం, ప్రమాద మరణాలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కు అప్పజెప్పి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందని, జులాయి 26 వరకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి అగ్రిమెంట్లో అయిపోయిందని , డెత్ లైన్ లో లేబర్ డిపార్ట్మెంట్ వారు తీసుకోకుండా కార్మికులను చివరి ఇబ్బందులకు గురి చేస్తున్నారని , ఇందిరమ్మ బీమా లో కలుపుతామని ప్రభుత్వం ఆలోచిస్తుందని , ఆధార్ అప్డేట్ మరియు పేర్లు సరి చేయడం అన్ని రాష్ట్ర బోర్డు దగ్గర పెట్టుకొని కార్మికులకు డబ్బులు మంజూరు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని , మీ సేవలో వద్ద దళవ్య వస్తే పెరిగిపోయి నిజమైన కార్మికులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఖాళీగా ఉన్న ఏ ఎల్ ఓ డి సి ఎల్ పోస్ట్ వెంటనే భర్తీ చేయాలని , కార్మికులకు అడ్డాల వద్ద షెల్టర్లు నిర్మించాలి, భవన నిర్మాణ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ 5000 రూపాయలు ఇవ్వాలని , సిఎస్సి హెల్త్ టెస్టులు రద్దు చేయాలని , సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున సంక్షేమ బోర్డును కాపాడకుంటే ఆందోళన కార్యక్రమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, డొక్కా లక్ష్మయ్య మేస్త్రి, జెట్టి,బాలస్వామి ఈర్ల భూపేష్, గొర్ల సత్యం,ఈర్ల హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కల్పన, మల్లేష్, ఆర్ రవి, మేస్త్రీలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: