Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కు తన సహయ సహకారాలు ఉంటాయి

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 07:06 AM | 5 | Politics, తెలంగాణ
టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కు తన సహయ సహకారాలు ఉంటాయి
టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కు తన సహయ సహకారాలు ఉంటాయి: 
 నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు,అధికారులు.

రిపోర్టర్ సతీష్, (తెలంగాణ కెరటం)

 కుత్బుల్లాపూర్ టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ కు తన సహయ సహకారాలు ఉంటాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. గురువారం టిడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా సంఘం ఆధ్వర్యంలో కలిశారు. అనంతరం ఆయనను శాలువతో సత్కరించారు. తదనంతరం బాచుపల్లి సిఐ దాలినాయుడు, బాచుపల్లి మాజీ సర్పంచ్ ఆగం పాండులను కలిసి శాలువాతో సత్కరించారు. వారు నూతన కమిటీ సభ్యులకు సన్మానం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా పనిచేస్తూ సంఘాన్ని సమన్వయం చేస్తున్న విధానాన్ని అభినందించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి ఉంటుందని భరోసా ఇచ్చారు. నూతన కమిటీ మరింత ముందుకు సాగి జర్నలిస్టుల సమస్యలపై పోరాడాలని సూచించారు. నిరంతరం ప్రజాసేవలో ముందుంటున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే అక్రిడేషన్ కార్డులు అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈకార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది అశోక్, టిడబ్ల్యూజెఫ్ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు ఏ. గోవిందరావు,కార్యదర్శి పి. బ్రహ్మచారి, కోశాధికారి కొండ సంజీవకుమార్, ఉపాధ్యక్షులు మంజుల రెడ్డి, ఎం.దివాకర్, జోగు వెంకట్, కమిటీ సభ్యులు కుమార్ గౌడ్, సాయిరాజ్, ప్రవీణ్, సుస్మితరెడ్డి, శ్యామ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: