Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అంగన్‌వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం ఘనంగ

అంగన్‌వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం ఘనంగ
  • అంగన్‌వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం ఘనంగ
అంగన్‌వాడీ కేంద్రంలో బాలల దినోత్సవం ఘనంగ

తెలంగాణ కెరటం ప్రతినిధి, మల్యాల:

మండలంలోని ముత్యంపేట గ్రామంలో బాలల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.

గ్రామంలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందుగా భారతదేశ మొదటి ప్రధానమంత్రి, చాచా నెహ్రూగా పిల్లలకు ఎంతో ఇష్టమైన జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నెహ్రూ దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ అభివృద్ధి కోసం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పిల్లలే దేశానికి భవిష్యత్తు అని నెహ్రూ చెప్పిన మాటలను కొనియాడారు. చిన్నారులు చదువుతో పాటు మంచి అలవాట్లు, క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా చిన్నారులు వివిధ రకాల వేషధారణలు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల ఆటపాటలు, చిరునవ్వులు కేంద్రంలో సందడి వాతావరణాన్ని నింపాయి. తల్లులు కూడా ఉత్సాహంగా పాల్గొని పిల్లలను ప్రోత్సహించారు.
అంగన్‌వాడీ కేంద్రాన్ని బాలూన్లు, పూలతో అందంగా అలంకరించారు. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్లు పంచి సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ శారద, ఆశా వర్కర్లు, తల్లులు, చిన్నారులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: