17,500 మంది ఉద్యోగుల పక్షాన నిలిచి కీలక పాత్ర.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 14):
ఎన్హెచ్ఎం ఉద్యోగుల 32 రోజుల సమిష్టి పోరాటానికి ఫలితం దక్కింది 17,500 మంది ఉద్యోగుల పక్షాన నిలిచి డాక్టర్ ఎంపీ మల్లు రవి చొరవ, ప్రభుత్వంతో నిరంతర చర్చలు. ఉద్యోగుల డిమాండ్లపై లిఖితపూర్వక హామీతో మూడు నెలల గడువుతో సమ్మె తాత్కాలిక విరమణ తో సమానం నిర్వహించారు
నాగర్కర్నూల్ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం ఎస్) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 32 రోజుల పాటు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన నిరవధిక సమ్మెకు సానుకూల ఫలితం లభించింది.తెలంగాణ ఎన్ హెచ్ ఎం జేఏసీ రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ప్రత్యేక చొరవ, నిరంతర కృషి, ప్రభుత్వ పెద్దలతో జరిపిన చర్చలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కీలకంగా నిలిచాయని ఎన్ హెచ్ ఎం జేఏసీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైన రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లింపు, ఉద్యోగ భద్రత, జీవిత బీమా, ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు, స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్చే అంశంపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీలు లభించడం హర్షణీయమన్నారు.ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, చర్చల ద్వారా పరిష్కారానికి మార్గం చూపించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ (సి ఎఫ్ డబ్ల్యూ) కి, (ఎన్ హెచ్ ఎం) రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలకు సహకరించి, సానుకూల నిర్ణయాల ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కి, నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 32 రోజుల సమ్మె కాలంలో సమ్మె శిబిరాలను సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించడంతో పాటు, ఉద్యోగుల సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.17,500 మంది ఎన్ హెచ్ ఎం సి ఉద్యోగులకు అండగా నిలిచిన ఎంపీ డాక్టర్ మల్లు రవి ఈ ఉద్యమంలో తెలంగాణ ఎన్ హెచ్ ఎం జేఏసీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి పాత్ర అత్యంత కీలకమని జిల్లా నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు.32 రోజుల సుదీర్ఘ సమ్మె పోరాటంలో ఎన్ హెచ్ ఎం సి ఉద్యోగుల వెన్నంటి నిలిచి, రాష్ట్ర జేఏసీ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి విశేష కృషి చేశారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, వారి గొంతుకను ప్రభుత్వ స్థాయిలో బలంగా వినిపిస్తూ, రాష్ట్ర కమిటీకి అండగా నిలిచి సానుకూల ఫలితాలు సాధించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అభినందనీయమన్నారు.నాగర్కర్నూల్ జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, తెలంగాణ ఎన్ హెచ్ ఎం జేఏసీ రాష్ట్ర కమిటీకి అధ్యక్షులుగా ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,500 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నేడు ఉద్యోగులకు లభించిన ప్రభుత్వ హామీల వెనుక డాక్టర్ మల్లు రవి గారు అందించిన సహకారం, చొరవ, మార్గదర్శకత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు.కష్టకాలంలో 17,500 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులకు అండగా నిలిచి, వారి హక్కుల సాధన కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపి కీలక పాత్ర పోషించిన ఎంపీ డాక్టర్ మల్లు రవి కి తెలంగాణలోని 17,500 మంది ఎన్ హెచ్ ఎం ఉద్యోగులమంతా ఎప్పటికీ రుణపడి ఉంటామని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన అందించిన సహకారాన్ని, సేవలను ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల కుటుంబం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.
ఉద్యమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
ఈ ఉద్యమ విజయానికి అండగా నిలిచిన తెలంగాణ ఎన్ హెచ్ ఎం జేఏసీ రాష్ట్ర కమిటీ నాయకులకు, జిల్లా నాయకులకు, మీడియా మిత్రులకు, సహకరించిన అధికారులకు, ఉద్యోగ సంఘాల నాయకులకు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ విజయం ఏ ఒక్కరిదో కాదని, ప్రతి ఎన్ హెచ్ ఎం ఉద్యోగి 32 రోజుల కష్టానికి, త్యాగానికి, ఐక్యతకు దక్కిన ఫలితమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి భాగస్వామ్యంతో సాధించిన ఈ విజయాన్ని రాష్ట్రంలోని ప్రతి ఎన్ హెచ్ ఎం ఉద్యోగికి అంకితం చేస్తున్నామని తెలిపారు.
మూడు నెలల కాలపరిమితితో సమ్మె తాత్కాలిక విరమణ.
ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలపై విశ్వాసం ఉంచుతూ, ముఖ్యంగా ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ శాలరీ అమలు చేయడానికి ప్రభుత్వం మూడు నెలల కాలపరిమితిలో సానుకూల నిర్ణయం తీసుకుని అమలు చేస్తుందనే నమ్మకంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఎన్ హెచ్ ఎం నాయకులు ప్రకటించారు.ప్రజలకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకూడదనే బాధ్యతతో 32 రోజులుగా కొనసాగుతున్న నిరవధిక సమ్మెను మూడు నెలల కాలపరిమితితో తాత్కాలికంగా విరమించి ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు.ఈ మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 100 శాతం గ్రాస్ శాలరీ అమలుతో పాటు సామాజిక భద్రతా ప్రయోజనాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ హామీల అమలును రాష్ట్ర ఎన్ హెచ్ ఎం జేఏసీ నిరంతరం పర్యవేక్షిస్తుందని, నిర్ణీత కాలపరిమితిలో హామీలు అమలుకాకపోతే రాష్ట్ర కమిటీ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రత సహా మిగిలిన న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ పోరాటం ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని, ఉద్యోగుల హక్కులు, సంక్షేమం సాధించే వరకు ఐక్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్ హెచ్ ఎం జేఏసీ ప్రతినిధులు హైమావతి, శ్రీనివాసులు, డాక్టర్ జగన్, ప్రవీణ్, డాక్టర్ సంధ్య, డాక్టర్ మహతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులందరూ ఉద్యోగుల సమిష్టి పోరాట విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ హామీల అమలు కోసం భవిష్యత్తులోనూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు సమ్మె తాత్కాలిక విరమణను ప్రకటించగా, ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు.



