జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి.
చౌట్కూర్ గ్రామ సర్పంచ్ పరకాల రామ్ రెడ్డి
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో ఆందోల్ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.
నేడే 15వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జేఎన్టీయూ కళాశాల, సుల్తాన్‌పూర్, చౌటకూరు మండలం వేదికగా జాబ్ మేళా జరగనుంది.
ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. 10వ తరగతి నుంచి పై చదువులు చదివిన అభ్యర్థులు అర్హులు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు:
* నెల జీతం: ₹19,288
* పని ప్రదేశం: కొంగర కలాన్, కేకే పార్క్, హైదరాబాద్
* విధులు: రొటేషనల్ షిఫ్ట్ విధానం
* వారానికి ఒకరోజు సెలవు
* ఉచిత భోజనం, ఉచిత రవాణా సదుపాయం
అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలు:
1. ఆధార్ కార్డు
2. పాన్ కార్డు
3. పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
4. బ్యాంక్ పాస్‌బుక్
5. విద్యార్హత సర్టిఫికెట్లు
అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాకు హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
మరిన్ని వివరాలకు:
రాధిక – 9059618521
నవీన్ – 9398946830
మూర్తి – 7842461759



