Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కల్వకుర్తిలో ఘనంగా చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 09:25 PM | 3 | Politics, తెలంగాణ
కల్వకుర్తిలో ఘనంగా చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం
కల్వకుర్తిలో ఘనంగా చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం   
                                      తెలంగాణ కెరటం కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 14. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఘనంగా నిర్వహించారు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైనటువంటి వారికి చేయూత పెన్షన్లను పెద్ద ఎత్తున మంజూరు చేసిందని భవిష్యత్తులో కూడా ఇంకా మంజూరు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు. కార్యక్రమాన్ని స్థానిక సి కె ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వార్డు కౌన్సిలర్లు గ్రామ సర్పంచులు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: