Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

Author
Posted By TELANGANA KERATAM
| 14 Nov 2026, 09:27 PM | 3 | Politics, తెలంగాణ
భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
  • భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
భారత్ సమ్మిట్ ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

ఇది భారతదేశ వ్యతిరేకుల సమ్మిట్.

బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 14 : తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రమని ప్రపంచానికి చూపించడం కోసం భారత వ్యతిరేక శక్తులతో ఏర్పాటు చేసిన భారత్ సమ్మిట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి మాట్లాడుతూ భారత్ సమ్మిట్ సమావేశంలో పెట్టుబడుల కోసం కాకుండా ప్రజాస్వామ్యం, సామాజిక,ఆర్థిక న్యాయం, యువత, జెన్ జెడ్, సర్ ప్రక్రియ, లాంటి మొదలగు అంశాలు చర్చకు పెట్టి దేశంలో జాతీయ సమైక్యతకు భంగం కలిగించే ప్రక్రియకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టి విదేశాల నుండి 1000 మంది ప్రతి నిదులను ఆహ్వానించి ఏ రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో లేని రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా పిలిచి కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి వాడుకోవాలని చూస్తుందని విమర్శించారు. ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు రాహుల్ గాంధీని భారతదేశానికి కాబోయే నాయకునిగా చిత్రీకరించే ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే మీటింగ్లో రాహుల్ గాంధీ ఏ అర్హతతో పాల్గొన్నారని తెలంగాణ రాష్ట్రంలో ఒకపక్క ఎల్ నిన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ స్వార్థ ప్రయోజనం కోసం భారత్ సమ్మిట్ పేరిట మీటింగ్ పెట్టి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా పిలిచి రేవంత్ రెడ్డి ఢిల్లీ నాయకత్వానికి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కాశెట్టి తిరుపతి, ఆముద రాజు, జిల్లా పదాధికారులు మ్యాదరి అశోక్, సుదవేణి మహేష్, ఏనుగు ముత్యం రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, కౌన్సిలర్ సిరిపురం శ్రీలత శ్రీనివాస్, జిల్లా వివిధ మోర్చాల అధ్యక్షులు ఇట్టేడి శేఖర్ రెడ్డి, నారపాక అశోక్, దుర్శెట్టి మమత, సింగు అంజలి, సింగం పద్మ, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: