Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా గడ్డం ఇందుప్రియ

Author
Posted By G GOPAL
| 17 Nov 2026, 03:41 PM | 11 | Politics, తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా గడ్డం ఇందుప్రియ
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా గడ్డం ఇందుప్రియ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇందుప్రియ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జనరల్ సెక్రటరీ పదవి అప్పగించిన నాయకత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడటంతో పాటు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. తనపై నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని గడ్డం ఇందుప్రియ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: