తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు.మంచిర్యాల...చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, మందమర్రి మున్సిపాలిటీ 23వ వార్డు మేదర్ బస్తిలోని UPS పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని.ప్రజల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా ప్రతి అర్హత గల కుటుంబానికి భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్ సినియర్ నాయకుడు ఎర్ర రాజు వివరించారు.ఈ కార్యక్రమంలో 23వ వార్డు ఆఫీసర్ లింగయ్య, కంప్యూటర్ ఆపరేటర్ చంద్రశేఖర్, RPలు భాగ్యలక్ష్మి, సరస్వతి, కాంగ్రెస్ నాయకులు ఎర్ర రాజు, దుర్గం ప్రభాకర్, సోదరి తిరుపతి, జక్కని సత్యనారాయణ , పత్తిపాక విజయ్, దూసముడి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
23వ వార్డులో మేదర్ బస్తి UPS పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం.....
23వ వార్డులో మేదర్ బస్తి UPS పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం.....
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:



