Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతులు ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 04:00 PM | 3 | Politics, తెలంగాణ
రైతులు ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ఏఎంసీ చైర్మెన్ పుండ్ర నారాయణ రెడ్డి
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : కథలాపూర్ మండల కేంద్రంలో, సిరికొండ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కథలాపూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరిప్రసాద్ లు కోరారు. ఆయా గ్రామాల్లో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఐకేపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని, దళరులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు కోనేందుంకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. ప్రస్తుతం సూపర్ ఎల్నినో కారణంగా నీటి ఎద్దడి ఏర్పడి, వేసవి కాలం తీవ్ర కరువు వాటిల్లే అవకాశం ఉన్నందున వ్యవసాయ అధికారుల సూచనల మేరకు, ముఖ్యమంత్రి రేవంతరెడ్డి తెలిపిన విధంగా రైతులు అరుతడి పంటలను వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలిచాల సత్యనారాయణ, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాయితీ నాగరాజు, కథలాపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు న్యావనంది శేఖర్, భూషణరావుపేట ఫ్యాక్స్ చైర్మన్ గడ్డం స్వామి రెడ్డి, సిరికొండ ఫ్యాక్స్ చైర్మన్ ఎండి ముబిన్, సర్పంచ్ ముధం రవి, ఏఎంసి డైరెక్టర్స్ వాకిటి రాజారెడ్డి, రమేష్ నాయక్ లతో పాటు పలువురు రైతులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: