Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మద్దిమడుగు గ్రామ అభివృద్ధికి పకడ్బందీ చర్యలు.

Author
Posted By TELANGANA KERATAM
| 10 Nov 2026, 05:19 PM | 5 | Politics, తెలంగాణ
మద్దిమడుగు గ్రామ అభివృద్ధికి పకడ్బందీ చర్యలు.
మద్దిమడుగు గ్రామ అభివృద్ధికి పకడ్బందీ చర్యలు.

అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలి.

భూభారతి కార్యక్రమంలో భాగంగా భూ రీ సర్వేను నెల రోజుల్లో పూర్తి చేయాలి.

మద్దిమడుగు గ్రామంలో  భూ రీ సర్వే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10):

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, పదర మండలం మద్దిమడుగు గ్రామంలో భూభారతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం నిర్వహించిన భూ రీ సర్వే అవగాహన సదస్సులో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చెన్నయ్య, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్ర, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్రతో, లతో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొని గ్రామస్తులకు సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు.
జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ మద్దిమడుగు గ్రామానికి ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, భవిష్యత్తులో గ్రామం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో గ్రామ పరిధిలో భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు, సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూభారతి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న భూ రీ సర్వేను అత్యంత ప్రాధాన్యతతో, పకడ్బందీగా నిర్వహించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
గ్రామ పరిధిలోని అటవీ, రెవెన్యూ భూముల మధ్య ఉన్న సరిహద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టంగా గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గతంలో భూ సరిహద్దుల విషయంలో తలెత్తిన సమస్యలు, అపోహలు, వివాదాలను గుర్తించి రెవెన్యూ, అటవీ శాఖల అధికారులుసమన్వయంతో పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అందుబాటులో ఉన్న భూ రికార్డులు, మ్యాపులు, ఇతర ఆధారాలను పరిశీలించి పారదర్శకంగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
భూ రీ సర్వే కేవలం భూముల కొలతలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో భూ సంబంధిత వివాదాలకు తావులేకుండా స్పష్టమైన రికార్డులు రూపొందించేలా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వే సమయంలో గ్రామస్తుల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకితీసుకోవాలనివారికి పూర్తి వివరాలు తెలియజేస్తూ వారి సమక్షంలోనే సర్వే ప్రక్రియ నిర్వహించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.సర్వే పూర్తయిన అనంతరం మరోసారి గ్రామసభ నిర్వహించి గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు, సమస్యలు, సూచనలు స్వీకరించాలని తెలిపారు. సంబంధిత శాఖల నివేదికలు, భూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు. గ్రామస్తులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలు, అందుబాటులో ఉన్న రికార్డులను అధికారులకు అందించి సర్వేకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయంతో భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించడం ద్వారా భవిష్యత్తులో అనవసర వివాదాలను నివారించవచ్చని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి ఒక్కరి భూ హక్కులకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ఇదిలా ఉండగా, గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థల ఎంపికతో పాటు అవసరమైన ఏర్పాట్లపై ముందస్తు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చెన్నయ్య, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్ర, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర,  గ్రామ సర్పంచ్‌తో కలిసి మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అధికారులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సంబంధిత శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: