ఎల్నినో ప్రభావంతో కరువు – రైతులను ఆదుకోవాలి......
దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం చేపట్టాలి – మంచిర్యాల జిల్లాకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల సాగునీరు కేటాయించాలి.....
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన నిర్మించాలి:
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల....
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర నీటి విధానాన్ని అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్రు చేశారు.మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ ) ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం చేపట్టి ప్రతి ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు.
మంచిర్యాల జిల్లాలో వ్యవసాయానికి సాగునీటి కొరత లేకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జిల్లాకు 20 టీఎంసీల సాగునీరు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి పెండింగ్లో ఉన్న నీటిపారుదల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.
వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేసి రైతులను ఆదుకునేలా ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించాలని అన్నారు. నీటి ఎద్దడిని నివారించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకొని రైస్ మిల్లర్లు, ట్రేడర్లు బియ్యం ధరలను అధికంగా పెంచి సామాన్య ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. బియ్యం ధరల పెరుగుదలను తక్షణమే నియంత్రించి, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు పంట నష్టపరిహారం, సాగునీటి సౌకర్యం, అవసరమైన వ్యవసాయ సహాయం అందించడంతో పాటు సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం ఈ సమస్యలపై అదనపు కలెక్టర్ వడాల రాములు గారికి సిపిఐ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మంచిర్యాల జిల్లా రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించాలి.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు.
మేకల దాసు,రేగుంట చంద్రశేఖర్,జోగుల మల్లయ్య, బొల్లం పూర్ణిమ,ఇప్పకాయల లింగయ్య.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు
కలిందర్ అలీ ఖాన్,కారుకూరి నగేష్,లింగం రవి,దాగం మల్లేష్,మిట్టపల్లి శ్రీనివాస్,రేగుంట చంద్రకళ, చిప్ప నర్సయ్య,సిపిఐ మండల కార్యదర్శులుకొండు బానేష్,బొంతల లక్ష్మినారాయణ, వనం సత్యనారాయణ,మేదరి దేవావరం,అందే పురుషోత్తం, దేవి పోచన్న,కామేర దుర్గరాజ్, తిలక్ అంబేద్కర్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు, మిట్టపల్లి పౌలు, మామిడి గోపి , కొట్టే కిషన్ రావు, మొగిలి లక్ష్మణ్, గుండా చంద్ర మాణిక్యం, మేకల రాజేశం,జాడి పోషం, చాడా మహేందర్ రెడ్డి, కాదండి సాంబయ్య, ఎగుడ మొండి,పార్టీ ప్రజాసంఘాల నాయకులు శ్రేణులు పాల్గొన్నారు



