Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

డాక్టర్ ఇంద్ర జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 07:07 PM | 4 | Politics, తెలంగాణ
డాక్టర్ ఇంద్ర జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
డాక్టర్ ఇంద్ర జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11, నవంబర్ 

సుమారు 100 మంది రక్తదానం.. రక్తదానం ప్రాణదానంతో సమానమని చాటిన దాతలు
సదాశివపేట పట్టణంలోని సాయిరాం హాస్పిటల్‌లో డాక్టర్ ఇంద్ర జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించగా, సుమారు 100 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను నిర్వాహకులు అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
అనంతరం సంతోష్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ ఇంద్రకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: