Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎల్ నినో ప్రభావాలపై రైతులకు అవగాహన

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 08:09 PM | 4 | Politics, తెలంగాణ
ఎల్ నినో ప్రభావాలపై  రైతులకు అవగాహన
ఎల్ నినో ప్రభావాలపై  రైతులకు అవగాహన 

 కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 11 

 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని శేరితండా మరియు ధర్మసాగర్ గేట్ తండాలో గ్రామసభలు నిర్వహణ ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో రానున్న వర్షాకాలంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించేందుకు శేరితండా గ్రామపంచాయతీతో పాటు ధర్మసాగర్ గేట్ తండాలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) పుణ్యవతి మాట్లాడుతూ ప్రస్తుత భూగర్భ జలాల పరిస్థితులను వివరించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, అలసంద వంటి పంటలతో పాటు పొద్దుతిరుగుడు, వేరుశనగ వంటి నూనెగింజల పంటలను సాగు చేయాలని తెలిపారు. అనుకూలమైన భూములు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు.మండల వ్యవసాయ అధికారి స్వప్న, వ్యవసాయ విస్తరణ అధికారి నరేందర్ మాట్లాడుతూ రుతుపవనాల రాక, వర్షపాత పరిస్థితులు, విత్తనాలు విత్తేందుకు అనువైన సమయం తదితర అంశాలను వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.ఉద్యానవన శాఖ అధికారి మహేశ్వరి మాట్లాడుతూ నీటి లభ్యతను బట్టి ఆకుకూరలు, బెండ, గోరుచిక్కుడు వంటి కూరగాయల పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు. బిందు సేద్యం సౌకర్యం ఉన్న రైతులు టమాటా, మిరప, బీరకాయ, కాకరకాయ, సొరకాయ వంటి పంటలను సాగు చేసుకోవచ్చని వివరించారు. బిందు సేద్యం పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, చిన్న, సన్నకారు, బీసీ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం రాయితీపై పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు వివిధ పథకాల ద్వారా చేపట్టే పనులను వివరించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, గ్రామస్థాయిలో సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయ కుంటలు నిర్మించుకొని వర్షపు నీటిని నిల్వ చేసుకుంటే అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. మిషన్ భగీరథ శాఖ ఏఈ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఏర్పాటు చేసిన నీటి కనెక్షన్ వద్ద ఆన్‌–ఆఫ్ కుళాయి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు మాత్రమే నీటిని వినియోగించి, వెంటనే కుళాయిని మూసివేయడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చని వివరించారు.తహసీల్దార్ కృష్ణ మాట్లాడుతూ నీరు ప్రతి ఒక్కరికీ ఎంతో విలువైన వనరని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేందుకు గ్రామస్థులు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏడీఏ పుణ్యవతి, మండల వ్యవసాయ అధికారి స్వప్న, వ్యవసాయ విస్తరణ అధికారి నరేందర్, ఉద్యానవన శాఖ అధికారి మహేశ్వరి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ, ఏపీఓ, మిషన్ భగీరథ ఏఈ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఏఈ, గ్రామ సర్పంచులు, రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: