Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అనురాగ్ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం శిబిరం ప్రారంభం

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 08:11 PM | 18 | Politics, తెలంగాణ
అనురాగ్ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం శిబిరం ప్రారంభం
అనురాగ్ యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం శిబిరం ప్రారంభం
-ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి హాజరైన యువ సేవకులు

(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 11: అనురాగ్ విశ్వవిద్యాలయంలో పశ్చిమ మండల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ పూర్వ శిబిరం–2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాలతో పాటు దమన్, దీయూ, దాద్రా, నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల నుంచి జాతీయ సేవా పథకం సేవకులు, అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ చైర్మన్, జనగామ శాసనసభ్యుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా, జిల్లా మహిళా భద్రతా విభాగం ఉప పోలీసు కమిషనర్ ఉషారాణి గౌరవ అతిథిగా, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధి, దేశ నిర్మాణంలో యువత చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిస్వార్థ సేవ, అంకితభావం, జాతీయ సమైక్యతా భావాలను అలవర్చుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. జాతీయ సేవా పథకం ప్రధాన నినాదమైన ‘నేను కాదు.. నీవు’ అనే సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితం కావాలని అతిథులు సూచించారు. ఈ శిబిరం యువతలో నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక మార్పిడి, జాతీయ సమైక్యత, సామాజిక సేవాభావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రాంతీయ సంచాలకులు, శిబిర సంచాలకులు ఆర్. సైదా, విశ్వవిద్యాలయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ సి. మల్లేశ్, అధికారులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సేవకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: