Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సిద్దిపేట సురక్ష నేత్ర’తో గ్రామీణ ప్రాంతాలకు భద్రతా కవచం

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 08:23 PM | 4 | Politics, తెలంగాణ
సిద్దిపేట సురక్ష నేత్ర’తో గ్రామీణ ప్రాంతాలకు భద్రతా కవచం
సిద్దిపేట సురక్ష నేత్ర’తో గ్రామీణ ప్రాంతాలకు భద్రతా కవచం

ఒకే రోజు జిల్లా వ్యాప్తంగా 300 సీసీటీవీ కెమెరాల ప్రారంభం
 కొండపాక మండలం మర్పడగ గ్రామంలో 40 సీసీ కెమెరాలు, మద్దూరు మండలం బైరాన్ పల్లి గ్రామంలో 30 సీసీటీవీ కెమెరాలు ప్రారంభించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్  రష్మి పెరుమాళ్
సైబర్ నేరాలు, ఉద్యోగ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిపి పిలుపు

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి 

సిద్దిపేట జిల్లా ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 300 సీసీటీవీ కెమెరాలను ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా, సిద్దిపేట మూడోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్పడగ గ్రామంలో గ్రామ పంచాయతీ సహకారంతో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను, మద్దూరు మండలం బైరాన్ పల్లి గ్రామంలో 30 సీసీటీవీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్  రష్మి పెరుమాళ్, ఐపిఎస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

కమిషనర్  రష్మి పెరుమాళ్, ఐ పి ఎస్ మా ట్లాడుతూ

సీసీటీవీ కెమెరాలు నేరాల నిరోధానికి, జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి 24/7 గ్రామాలను నిఘా నీడలో ఉంచుతూ, ప్రజలకు ఒక అదనపు రక్షణ పొరలా పనిచేస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళు, వ్యాపార సముదాయాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది అని తెలిపారు. కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడం  చాలా ముఖ్యం. టీవీ లేదా మొబైల్ ఫోన్ పాడైతే ఎలా రిపేర్ చేసుకుంటామో, అలాగే సీసీ కెమెరాలకు కూడా వెండర్లతో 2-3 ఏళ్ల పాటు సర్వీస్ కాంట్రాక్ట్  ఏర్పాటు చేసుకోవాలి. క్రమబద్ధమైన నిర్వహణ ఉంటే ఇవి చాలా కాలం సేవలు అందిస్తాయి 
 ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, విదేశాలకు పంపిస్తామని డబ్బులు అడిగే దళారులను నమ్మవద్దు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్త అని డబ్బులు అడిగితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించండి అని తెలిపారు.ప్రస్తుతం ఫోన్లలోనే మన ఆర్థిక, వ్యక్తిగత సమాచారం ఉంటోంది. కాబట్టి బ్యాంక్ పిన్‌లు, పాస్‌వర్డ్‌లను ఫోన్లలో సేవ్ చేయవద్దనీ ఏ బ్యాంకూ ఫోన్ చేసి ఓటీపీ లేదా పిన్ నంబర్లు అడగదు. అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దు అని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించారు.గ్రామంలోని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు.  ఈరోజు ప్రారంభించిన 23 గ్రామలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, గ్రామ ప్రజలకు పోలీస్ కమిషనర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని జిల్లాలోని మిగతా గ్రామాలు కూడా ముందుకు వచ్చి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్దిపేట్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీబాబు, హుస్నాబాద్ ఏసిపి సదానందం, చేర్యాల సిఐ రమేష్, మద్దూరు ఎస్సై ఆసిఫ్, కొమురవెల్లి ఎస్ఐ మహేష్,  గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: