నూతన పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం,
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 14, నవంబర్
కౌన్సిలర్ సభ్యులకు కో-ఆప్షన్ సభ్యులకు నమస్కారం.
ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నాము.
తేదీ: 16-11-2026 (సోమవారం)
సమయం: ఉదయం 10:30 గంటలకు
వేదిక: లక్ష్మీదేవి గార్డెన్, చందంపేట రోడ్డు, జోగిపేట
ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
కావున, ప్రతి వార్డులోని నూతన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కార్యక్రమం గురించి ముందస్తు సమాచారం అందించి, వారు కార్యక్రమానికి హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
అలాగే, కౌన్సిలర్ సభ్యులు మరియు కో-ఆప్షన్ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరై, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.
ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం ఎంతో విలువైనది. మీ అందరి హాజరు, సహకారం ఈ కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూరుస్తాయి.
మీ అందరి హాజరు ఎంతో ముఖ్యం.
ఇట్లు,
మున్సిపల్ చైర్మన్ ఎస్ కృష్ణారెడ్డి,వైస్,చైర్మన్ చిట్టి బాబు
ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ



